Budhaditya Raja Yoga : బుధాదిత్య రాజయోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

by Phanindra |   (  Updated:2025-03-15 03:09:43  IST  )

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి

Budhaditya Raja Yoga : బుధాదిత్య రాజయోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయడం వలన యోగాలు ఏర్పడుతుంటాయి. వీటి ప్రభావం మనిషి జీవితంలో కొత్త మార్పులను తెస్తుంది. ఈ రోజు సూర్యుడు, మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఏడాది తర్వాత ఏర్పడే బుధాదిత్య రాజయోగం కొందరికి కలిసి రానుంది. ఈ సమయంలో వారి అదృష్టం పెరగడమే కాకుండా కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కుంభ రాశి

బుధాదిత్య రాజయోగం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. వ్యాపారాల్లో ధన లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు బాలన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో మీ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.

వృషభ రాశి

బుధాదిత్య రాజయోగం వలన వృషభ రాశి వారికి కలిసి రానుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. అలాగే, పిల్లలకు సంబంధించిన విషయంలో శుభవార్తలు వింటారు. చిరు వ్యాపారులకు లాభాలు వస్తాయి. పాత భూములకు రేట్లు పెరుగుతాయి. అలాగే, గతంలో పెట్టిన పెట్టుబడులకు భారీగా ధనం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Read More..

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (15-03-2025)

Next Story