- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సేవలు రద్దు
తిరుమల(Tirumala) కొండపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో శ్రీవారిని కాలినడకన తిరుమల కొండకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) కొండపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో శ్రీవారిని కాలినడకన తిరుమల కొండకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో టీటీడీ తాజాగా కీలక ప్రకటన చేసింది. తిరుమలలో దివ్య వైభవం ఉట్టిపడబోతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల(ఫిబ్రవరి) 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజుల్లో రాత్రి వేళ పుష్కరిణిలో స్వామి, అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిస్తారు.
రెండో రోజు రుక్మిణీ సమేత మురళీకృష్ణుడు భక్తుల(Devotees) హృదయమనోహరంగా దర్శనమిస్తారు. మూడో రోజు నుంచి చివరి రోజు వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారి తెప్ప విహారం మరింత వైభవంగా సాగునుందని టీటీడీ(TTD) పేర్కొంది. అయితే.. ఈ ఉత్సవాల కారణంగా తిరుమలలో జరగునున్న కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో భక్తులు తెప్పోత్సవ దర్శనం చేసుకోవడం మహా పుణ్యఫలంగా పండితులు చెబుతున్నారు. పుష్కరిణిలో ప్రతిబింబించే శ్రీవారి రూపం భక్తుల మనసుల్లో భక్తి, ఆనందం, శాంతిని నింపుతుందని భక్తుల నమ్మకం. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.






