శివ భక్తులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-21 15:00:48  IST  )

ప్రముఖ శైవ క్షేత్రం, ప్రముఖ జ్యోతిర్లింగం శ్రీశైల (Srisailam) భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి నవంబర్‌ 21 వరకు కార్తీక మాసోత్సవాలను (Kartika Month Celebrations) అట్టహాసంగ నిర్వహించనున్నారు.

శివ భక్తులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ శైవ క్షేత్రం, ప్రముఖ జ్యోతిర్లింగం శ్రీశైల (Srisailam) భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి నవంబర్‌ 21 వరకు కార్తీక మాసోత్సవాలను (Kartika Month Celebrations) అట్టహాసంగ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాస రావు (EO Srinivasa Rao) ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ పరిధిలో పారిశుద్ధ నిర్వహణ, ట్రాఫిక్, పార్కింగ్, మెడికల్ విభాగాలపై సమగ్రంగా చర్చించి చేయాల్సిన ఏర్పాట్లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల దర్శన ఏర్పాట్లు, పుణ్య స్నానాలపై కూడా చర్చించారు. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి రోజున జరిగే పుష్కరిణి హారతి (Pushkarini Aarti), లక్ష దీపోత్సవం, జ్వాలాతోరణోత్సవం, 31వ కృష్ణమ్మ హారతి, నవంబర్‌ 14న జరిగే కోటి దీపోత్సవం, 18వ తేదీన జరిగే తెప్పోత్సవం ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు అధికారులతో భేటీలో చర్చించారు.

Next Story