మల్లన్న భక్తులకు బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్‌లో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు

by Kema Shiva Kumar |

మహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam)లో మల్లికార్జునుడి స్పర్శ దర్శనం జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే.

మల్లన్న భక్తులకు బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్‌లో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam)లో మల్లికార్జునుడి స్పర్శ దర్శనం జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శ దర్శన (Sparsha Darshan) భాగ్యం కల్పించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. కేవలం మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆలయ ఈవో ఎం.శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ల జారీ విధానంలో ఆన్‌లైన్‌ (Online) విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నట్లుగా వెల్లడించారు. వచ్చే వారం నుంచి ఈ టోకెన్లను www.srisailadevasthanam.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా భక్తులు పొందవచ్చని పేర్కొన్నారు. కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానం‌లో రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తారు. ఆధార్ కార్డ్‌ను ఆధారంగా చేసుకుని టోకెన్లను జారీ చేయనున్నారు. అయితే, ఆలయ ఉత్సవాలు, పండుగలు, సెలవు రోజుల్లో స్పర్శ దర్శన సేవలను నిలిపివేయనున్నారు.

Next Story