తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని దర్శనానికి జనం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారు దర్శనానికి సమారు 3 గంటల సమయం పడుతోంది.

అదేవిధంగా గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లో మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 61,582 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 19,757 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story