తిరుమలలో మరో మూడు నెలలు రద్దీ.. టీటీడీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రానున్నవి వేసవి సెలవులు కావడంతో మరో మూడు నెలల తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది.

తిరుమలలో మరో మూడు నెలలు రద్దీ.. టీటీడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రానున్నవి వేసవి సెలవులు కావడంతో మరో మూడు నెలల తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రజాప్రతినిధులెవరూ సిఫార్సు లేఖలు ఇవ్వవద్దంటూ టీటీడీ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ మూడు నెలల పాటు తిరుమల కొండపై రద్దీ అత్యధికంగా ఉండనుందనే అంచనాలతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలలో కేవలం నలభై వేల మందికి మాత్రమే వసతి సౌకర్యం కల్పించే వీలున్నందున ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను ఇవ్వకూడదంటూ ప్రకటన చేసింది.

Next Story