- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత
ఏపీలోని ప్రముఖ జ్యోతిర్లింగా పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులకు బిగ్ అలర్ట్.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ జ్యోతిర్లింగా పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) భక్తులకు ఆలయ అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు. స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. అంటే.. మంగళవారం (జులై 15 నుంచి 19) నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:40 గంటల మధ్య కల్పించే స్పర్శ దర్శనం అనుమతి ఉండదు. ఈ సమయంలో స్పర్శ దర్శనానికి క్యూలైన్లో నిలిచే భక్తులకు కేవలం అలంకార దర్శనమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగటంతో శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) గేట్లు తెరవడంతో.. గత రెండు రోజులుగా ఇటు భక్తులు, అటు పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులకు అవస్థలు తలెత్తకుండా.. నిర్వహణపై భారం పడకుండా ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపినట్టు అధికారులు తెలిపారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ముందుగానే ఈ విషయాన్ని గుర్తించాలంటూ.. దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ఇదిలా ఉండగా.. పరిస్థితికి అనుగుణంగా తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని కోరారు.






