తిరుమలలో భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్

by Naga Rani Yarlagadda |

కలియుగ ఇలవైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండగా.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.

తిరుమలలో భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ఇలవైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండగా.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (సోమవారం) శ్రీవారిని 75,791 మంది భక్తులు దర్శించుకోగా.. 22,141 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు.

నేడు టీటీడీ స్థానిక దేవాలయాల సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్ సైట్లో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. 2026 ఫిబ్రవరి నెలకు గాను అలిపిరి సప్త గో ప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ ఓపెన్ అవుతుందని తెలిపింది.

Next Story