Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-21 02:27:04  IST  )

వేసవి సెలవులు కావటంతో తిరుమల (Tirumala) తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.

Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు కావటంతో తిరుమల (Tirumala) తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూకాంప్లెక్సు కంపార్టుమెంట్లన్నీ నిండిపోవటంతో, ఏటీజీహెచ్ (ఆళ్వార్‌ ట్యాంక్‌ గెస్ట్‌ హౌస్‌) వరకూ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బుధవారం శ్రీవారిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం అర్థరాత్రి వరకు స్వామివారిని 76,000 మంది భక్తులు దర్శించుకోగా.. 31,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు వెల్లడించారు.

Next Story