ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి రూ.100 కోట్ల విరాళాలు

by Naga Rani Yarlagadda |

మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఈ ఏడాది భారీగా విరాళాలు, కానుకలు వస్తున్నట్లు

ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి రూ.100 కోట్ల విరాళాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఈ ఏడాది భారీగా విరాళాలు, కానుకలు వస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మరో నాలుగు రోజుల్లో ముగియనుండగా.. దేశంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఉజ్జయినికి కూడా భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకూ 5.5 కోట్ల మంది భక్తులు మహాకాళేశ్వరుడిని దర్శించుకోగా.. స్వామివారికి విరాళాల రూపంలో రూ.100 కోట్లకుపైగా వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ విరాళాల్లో రూ.13 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయని పేర్కొంది. స్వామివారి శీఘ్రదర్శనం, విరాళాలు, కానుకలు, లడ్డూ ప్రసాదాల విక్రయంతో 2024లో రూ.92 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.107 కకోట్లు దాటినట్లు వివరించింది. గతేడాది శ్రావణమాసంలో రూ.22 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.30 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతీ ఏటా ఆలయానికి వచ్చే విరాళాలు పెరుగుతున్నాయని, వాటిని భక్తుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పనకు వాడుతున్నట్లుగా ఆలయ కమిటీ వెల్లడించింది. ఇక క్రిస్మస్ రోజున అత్యధికంగా 2.5 లక్షల మంది మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నట్లుగా ఆలయ కమిటీ పేర్కొంది.

Next Story