దేవిశ్రీ ఫోటోగ్రఫీ అద్భుతం.. నెటిజన్లు ఫిదా

by  |
దేవిశ్రీ ఫోటోగ్రఫీ అద్భుతం.. నెటిజన్లు ఫిదా
X

దేవిశ్రీ ప్రసాద్…ఒక బ్రాండ్. సినిమాలకు మ్యూజికల్ హిట్స్ అందించడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. మ్యూజికల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి అంటే అతిశయోక్తికాదు.

DSP మ్యూజికల్ అనేది ఒక బ్రాండ్. ఐతే దేవికి సంగీతంతో పాటు ఫోటోగ్రఫీలోనూ ప్రవేశం ఉన్నట్లు కొంతమందికి తెలుసు. అయితే టైం లాప్స్ ఫోటోగ్రఫీ లోనూ తనకు అనుభవం ఉందని ఎంత మందికి తెలుసు అంటున్నారు దేవి. బుద్ధ పూర్ణిమ రోజున తన ఇంటిపై చంద్రుడి ఫోటోలను తీసిన దేవిశ్రీ ప్రసాద్ .. తానే ఎడిట్ చేసి మరి ఆ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు.

చంద్రుడు నాతో మాట్లాడాడు.. జీవితంలో వచ్చే పాసింగ్ క్లౌడ్స్ గురించి.. కన్నీళ్లు – నవ్వులు.. ఎత్తు – పల్లాలు.. చీకటి – వెలుగులు.. వస్తుంటాయి పోతుంటాయి. అలాగే కరోనా మహమ్మారి కూడా పాసింగ్ క్లౌడ్ మాత్రమే.. తప్పకుండా మంచిరోజులు వస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు దేవి.

దేవి వీడియో పై ప్రశంసలు కురిపించారు ప్రముఖులు. DOP రత్నవేలు సైతం దేవి విజువల్ టాలెంట్ కు ఫిదా కాగా.. మీ ఫోటోగ్రఫీ గురించి రత్నవేలు కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే.. ఆస్కార్ అవార్డ్ కనుగొన్నవారి నుంచి ఆస్కార్ అవార్డు తీసుకోవడం లాంటింది అంటున్నారు.

https://www.youtube.com/watch?v=n_80dB47MqI&feature=youtu.be


Next Story

Most Viewed