#betheREALMAN: బన్నీని నామినేట్ చేసిన దేవి

by  |
#betheREALMAN: బన్నీని నామినేట్ చేసిన దేవి
X

లాక్ డౌన్ పీరియడ్ లో బాగా ట్రెండ్ అయిన చాలెంజ్ #betheREALMAN. సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ చాలెంజ్… దాదాపు అన్ని ఇండస్ట్రీలను చుట్టేసేలా ఉంది. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను నామినేట్ చేయగా సక్సెస్ ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇందులో భాగంగా ఇళ్లు ఊడ్చి, తుడిచి శుభ్రం చేసిన దేవి… అమ్మకు ఆమ్లెట్ చేసి పెట్టాడు. అమ్మ తిన్న ప్లేట్ ను శుభ్రం చేసిన దేవి… తర్వాత నాన్న ఫోటో దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో రియల్ మెన్స్ కు జన్మనిచ్చిన తల్లులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా ఈ చాలెంజ్ ను తన ఫ్రెండ్స్ అల్లు అర్జున్, యష్, కార్తీ, హరీష్ శంకర్ తో పాటు సీనియర్ హీరో మోహన్ లాల్ ను నామినేట్ చేశారు.

Tags : betheREALMAN, DeviSri Prasad, Allu Arjun, Yash, Karthi, Mohan Lal


Next Story

Most Viewed