- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవకట్ట సెల్యూట్స్ హైదరాబాద్ పోలీస్
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ… హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల బాధ్యతాయుతమైన తీరును అభినందిస్తూ పోస్ట్ పెట్టారు దర్శకులు దేవకట్టా. ఎర్రటి ఎండలో నిల్చుని ప్రజల రక్షణ కోసం అందిస్తున్న సూచనలపై ట్రాఫిక్ పోలీసులకు సెల్యూట్ చేశారు. పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంతో పోలీసులపై గౌరవం పెంరిగిందంటున్నారు సామాన్యులు. వారి డెడికేషన్ లెవల్స్‌కు సలాం కొడుతున్నారు. దేవకట్ట పోస్ట్ చేసిన వీడియోపై హీరో సాయి ధరమ్‌తేజ్‌తో పాటు పలువురు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ… హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల బాధ్యతాయుతమైన తీరును అభినందిస్తూ పోస్ట్ పెట్టారు దర్శకులు దేవకట్టా. ఎర్రటి ఎండలో నిల్చుని ప్రజల రక్షణ కోసం అందిస్తున్న సూచనలపై ట్రాఫిక్ పోలీసులకు సెల్యూట్ చేశారు. పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంతో పోలీసులపై గౌరవం పెంరిగిందంటున్నారు సామాన్యులు. వారి డెడికేషన్ లెవల్స్‌కు సలాం కొడుతున్నారు. దేవకట్ట పోస్ట్ చేసిన వీడియోపై హీరో సాయి ధరమ్‌తేజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలో ట్రాఫిక్ కూడలిలో నిల్చున్న పోలీసులు… కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను వివరించారు. ఈ సమయంలో చేతులను శుభ్రంగా ఎలా కడగాలో 10 స్టెప్స్‌లో వివరించారు. తుమ్మినా, దగ్గినా మోచేతిని ఎందుకు అడ్డుపెట్టుకోవాలో తెలిపిన పోలీసులు… ఎవరైనా కలిస్తే షేక్ హ్యాండ్ కాకుండా మర్యాదగా నమస్కరించాలని సూచించారు.
Salutes!! 🙏 pic.twitter.com/KWUvmSCCom
— deva katta (@devakatta) March 19, 2020
Tags : Deva Katta, Sai Dharam Tej, Hyderabad Traffic Police, Salute






