ఆ హీరోయిన్‌ గురించి డైరెక్టర్ స్పెషల్ ట్వీట్.. కారణమేంటో?

by  |
Krithi-Sanon,-Dev-Katta
X

దిశ, సినిమా: కృతిసనన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘మిమి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన మూవీ ఐఎండీబీలోనూ మంచి రేటింగ్ పొందగా.. డైరెక్టర్ దేవకట్టా ఈ చిత్రం గురించి ట్వీట్ చేశాడు. మిమి చాలా అందంగా ఉందన్న ఆయన.. తను ప్రేక్షకులను నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది, ఆచరించాలని చెబుతుందన్నారు. కృతిసనన్ ఏంజిల్‌లా ఉందన్న దేవకట్టా.. పంకజ్ త్రిపాఠి ఎప్పటిలాగే ది బెస్ట్‌గా కనిపించారని తెలిపాడు. ఒకవేళ అనాథలంతా ఒక దేశంగా ఏర్పడితే.. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశాల్లో తొమ్మిదో ర్యాంకులో ఉంటుందన్నాడు. 153 మిలియన్ కన్నా ఎక్కువ మంది చిన్నారులు పేరెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపాడు. కాగా దీనిపై స్పందించిన కృతి దేవకట్టాకు కృతజ్ఞతలు తెలిపింది.



Next Story

Most Viewed