ఈ సారి మాత్రం ఊరుకోను : దేవ కట్టా

by  |
ఈ సారి మాత్రం ఊరుకోను : దేవ కట్టా
X

దర్శకుడు దేవ కట్టా.. ‘ప్రస్థానం’ సినిమాతో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్. ‘వెన్నెల, ఆటోనగర్ సూర్య’ లాంటి సినిమాలు తీసిన దేవ కట్టా.. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ తెలుగు వెబ్‌సైట్‌లో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన ఓ నిర్మాతపై తీవ్ర ఆరోపణలు చేశాడు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్‌ల స్నేహం, రాజకీయ వైరాన్ని బేస్ చేసుకుని ఓ సిరీస్ రాబోతుందనేది ఆ వార్త సారాంశం కాగా.. దీనిపై దేవ కట్టా మండిపడ్డారు. 2017లోనే బాబు, వైఎస్సార్‌ల ఫ్రెండ్‌షిప్, రాజకీయ వైరం మీద తను ఫిక్షనల్ స్టోరీ రాసి రిజిస్టర్ కూడా చేయించానని తెలిపాడు. అయితే తన కాన్సెప్ట్‌ను వేరే వాళ్లు దొంగతనం చేశారని.. వాళ్లు లీగల్‌గా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

https://twitter.com/devakatta/status/1292930051810316288

గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయిన తను.. ఈ కాన్సెప్ట్ మీద మూడు భాగాలుగా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత దీన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేసి.. ఈ ఐడియాను పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వివరించినట్లు చెప్పాడు. అయితే గతంలో తన స్క్రిప్ట్ దొంగిలించి సినిమా చేసిన ఓ వ్యక్తి దాన్ని డిజాస్టర్ చేశాడని.. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ఈసారి అలా కానివ్వనని హెచ్చరించారు దేవ కట్టా. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Next Story