వేటికి అనుమతిచ్చారు.. వేటికి ఇయ్యలేదో మీకు తెలుసా..?

by  |
వేటికి అనుమతిచ్చారు.. వేటికి ఇయ్యలేదో మీకు తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపుల్చిన విషయం విధితమే. అయితే వేటికి అనుమతి ఇచ్చారు.. వేటికి ఇయ్యలేదో అనే వివరాలు స్పష్టంగా తెలియజేస్తూ..

1. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. కానీ, సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతి లేదు.
2. మెట్రో రైలు సేవలకు అనుమతిలేదు.
3. సరి-బేసి విధానంలో అన్ని చోట్లా షాపులు తెరుచుకోవచ్చు. కానీ, కంటైన్మెంట్లలో షాపులు తెరిచేందుకు అనుమతి లేదు.
4. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో ఆటోలు, ట్యాక్సీలు తిరగనున్నాయి. కానీ, ఆటోల్లో డ్రైవర్ తోపాటు ఇద్దరు, కార్లలో డ్రైవర్ తోపాటు ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి.
5. పరిశ్రమలన్నీ నడుపుకొవచ్చు.
6. ఇవాళ్టి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు.
7. ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలకు అనుమతి.
8. మాల్స్, ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, బార్లు, హోటళ్లు, పబ్స్, క్లబ్స్, జిమ్ లు, విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతి లేదు.
9. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతి లేదు.

అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా మే 31 వరకూ రాత్రి 7 గంటల నుంచి తిరిగి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనున్నది. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధించనున్నారు.

Next Story

Most Viewed