హీరోయిన్‌కు తీసిపోలే.. ‘చకా చక్’ పాటకు స్టెప్పులేసిన బామ్మ

by  |
Desi dadi Ravi Bala Sharma
X

దిశ, సినిమా : 63 ఏళ్ల దేశీ డాడీ రవిబాల శర్మ మరోసారి తన డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ‘అత్రంగి రే’ మూవీలోని చకా చక్ పాటకు సింపుల్‌గా స్టెప్పులేసి నెటిజన్లను ఫిదా చేసింది. సినిమాలో ఒరిజినల్ సాంగ్‌కు సారా అలీఖాన్ ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించిందో.. రవిబాల కూడా అలాగే అలంకరించుకుని స్టెప్పులేయడం విశేషం. ఈ వీడియోను తను ఇన్‌స్టా్గ్రామ్‌లో ‘చకా చక్’ క్యాప్షన్‌తో పోస్టు చేయగా.. నెట్టింట రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. వీడియోలోని దేశీ డాడీ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆంటీ మీ ఫిట్‌నెస్ చూశాక.. 63 ఏళ్ల బామ్మ కాదు, 63 ఏళ్ల అమ్మాయి’ అని పిలవాలనుంది అంటున్నారు. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ నటించిన ‘అత్రంగి రే’ చిత్రంలోని పాటను శ్రేయా ఘోషల్ ఆలపించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.



Next Story

Most Viewed