- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంట్రీ సాంగ్ నచ్చలేదని.. పెళ్లి కూతురు చేసిన పనికి షాకైన వరుడు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రజెంట్ జనరేషన్‌లో పెళ్లి కొడుకును ఇంప్రెస్ చేసేందుకు బుల్లెట్ బండి పాటకు ఓ నవవధువు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇలాగే తన ఎంట్రీతో పెళ్లికి వచ్చిన వారందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంది ఓ నవ వధువు. దీని కోసం వివాహ సమయంలో పెళ్లి మండపానికి ఎలా వెళ్లాలి. ఏ దుస్తులు ధరించాలి.. ఇలా ప్రతీ విషయానికి పక్కా ప్లాన్‌తో రెడీ చేసుకుంది. పెళ్లి మండపానికి తాను […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజెంట్ జనరేషన్‌లో పెళ్లి కొడుకును ఇంప్రెస్ చేసేందుకు బుల్లెట్ బండి పాటకు ఓ నవవధువు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇలాగే తన ఎంట్రీతో పెళ్లికి వచ్చిన వారందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంది ఓ నవ వధువు. దీని కోసం వివాహ సమయంలో పెళ్లి మండపానికి ఎలా వెళ్లాలి. ఏ దుస్తులు ధరించాలి.. ఇలా ప్రతీ విషయానికి పక్కా ప్లాన్‌తో రెడీ చేసుకుంది. పెళ్లి మండపానికి తాను ఇచ్చిన ఎంట్రీ.. మరపురాని క్షణాలు అవ్వాలనుకుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయించుకుంది.
ఈ క్రమంలోనే ‘శివానీ పిప్పెల్’ అనే ఈ వధువు.. ‘పియా మోహే ఘర్ఆయే..’ అంటూ సాగే ఓ హిందీ పాటతో మండపంలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. తీరా అక్కడికి చేరుకునే సరికి తాను చెప్పిన పాట కాకుండా వేరే పాట ప్లే అయింది. దీంతో అప్పటివరకు ఆమెలో ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా ఆవిరి అయిపోయింది.
తను ఎంచుకున్న పాటతో మండపం వద్దకు వెళ్లాలని అక్కడికి ఎంతో ఆశతో వచ్చానని.. కానీ అక్కడ వేరే పాటను పెట్టడం తనకు ఎంతో నిరాశ కలిగించిందని బంధువుల ముందు వాపోయింది. అలిగి.. ఆ పాట పెడితే కానీ అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పేసింది. వధువుకు సర్దిచెప్పిన బంధువులు.. అక్కడ ఉన్న డీజేలో ఆమె ఎంచుకున్న పాటను పెట్టించారు. దీంతో పెళ్లికూతురి ముఖం మళ్లీ వికసించింది. మండపానికి చేరుకుని.. వరుడుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- Tags
- Bride






