రఘు వీరా రెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం….

6

దిశ, వెబ్ డెస్క్:
కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డిని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వర్థ నారాయణ కలిశారు. శిరా ఉపఎన్నికల ప్రచారానికి అశ్వర్థ నారాయణ శుక్రవారం వచ్చారు. పలువురు నేతలతో కలిసి ఆయన నీలకంఠాపురానికి వచ్చారు. కాగా గత కొంతకాలంగా రాజకీయాలకు రఘువీరా రెడ్డి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో అశ్వర్థ నారాయణ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరా రెడ్డిని ఆయన కలవడంతో కొత్త చర్చకు దారి తీసింది.