బ్రేకింగ్.. నల్లమలలో హాజీపూర్ వద్ద బలగాల మోహరింపు..

256

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల హాజీపూర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంగళవారం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, వైఎస్సార్ టీఎస్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం నల్లమల సడక్ బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో హజీపూర్ చౌరస్తాలో నాగర్ కర్నూలు జిల్లా నాలుగు డివిజన్ల నుండి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సుమారు 200 మంది పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నుండి నేతలు హాజరవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలకు వరకు నల్లమల సడక్ బంద్ కార్యక్రమం ఉంటుందని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.