శశికళ దరఖాస్తు తిరస్కరణ

by  |
శశికళ దరఖాస్తు తిరస్కరణ
X

చెన్నై : అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ.. తనను ముందుగానే విడుదల చేయాల్సిందిగా పెట్టుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జైలు అధికారులు ముందుగానే విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇంతకు ముందు సైతం ఇలానే శశికళ గతంలో 120 రోజులకుపైగా రెమిషన్ ఉన్నా.. అప్పటి జైలర్ దాన్ని రద్దు చేశారు. జైల్లో ప్రత్యేక సదుపాయాలు అనుభవిస్తోందన్న ఆరోపణలు, పని సరిగా చేయకపోవడంతో ఈ రెమిషన్‌ను రద్దు చేశారు.

మళ్లీ ఈ నెల మొదట్లో ఆమె సమర్పించిన దరఖాస్తును పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు అధికారులు జైళ్ల శాఖకు పంపగా.. శనివారం దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఏడాదికి గరిష్ఠంగా మూడు నెలలు రెమిషన్‌ ఇస్తుంటారు. ఇదేమీ ఖైదీల హక్కు కాదు. కానీ..జైలు అధికారుల విచక్షణాధికారంతో వీటిని ఇస్తారని వారు చెప్పారు. శశికళ దరఖాస్తును అధికారులు తిరస్కరించడంతో వచ్చే ఏడాది జనవరి 27 వరకు ఆమె జైల్లోనే ఉండనున్నారు. అప్పటితో ఆమె నాలుగేళ్ల శిక్ష ముగియనుంది. ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యేందుకు శశికళ రూ.10కోట్ల జరిమానా చెల్లించారు.


Next Story

Most Viewed