రైల్వే ట్రాక్‌లపైనా ప్రదర్శనలు.. టోల్ ప్లాజాల ముట్టడి

by  |
రైల్వే ట్రాక్‌లపైనా ప్రదర్శనలు.. టోల్ ప్లాజాల ముట్టడి
X

న్యూఢిల్లీ: తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని, ప్రదర్శనలు ఇక నుంచి రైల్వే ట్రాక్‌లపైనా చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. కేవలం పంజాబ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లపై నిరసనలు చేస్తామని తెలిపాయి. తేదీ ఖరారు చేసి ప్రకటిస్తామని రైతు నేత బూటా సింగ్ అన్నారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దులో సింఘులో విలేకరులతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను ముట్టడిస్తామని, జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతామని తెలిపారు. ఢిల్లీకి చేరే రహదారులన్నింటినీ దిగ్బంధిస్తామని వివరించారు. మరో రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ, నూతన సాగు చట్టాలు వర్తకుల కోసమని కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు. వ్యవసాయం రాష్ట్రాల జాబితాలోకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సాగుపై చట్టాలు చేసే హక్కు ఉండదని అన్నారు.


Next Story

Most Viewed