- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మింకపల్లిలో నక్సల్స్ స్మారక స్థూపం కూల్చివేత
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా మావోయిస్టుల స్మారక స్థూపాలు ఎక్కడ కనిపించినా పోలీసులు కూల్చివేస్తున్నారు. గురువారం బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు మింకపల్లి వద్ద స్మారక స్థూపాన్ని కూల్చివేశారు. బీజాపూర్ ఎస్‌పీ కమలోచన్ […]</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ గాలింపు చర్యల్లో భాగంగా మావోయిస్టుల స్మారక స్థూపాలు ఎక్కడ కనిపించినా పోలీసులు కూల్చివేస్తున్నారు. గురువారం బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు మింకపల్లి వద్ద స్మారక స్థూపాన్ని కూల్చివేశారు. బీజాపూర్ ఎస్‌పీ కమలోచన్ కశ్యప్ ఈ విషయం తెలిపారు.
Next Story






