పండుగ సీజన్ ఈ-కామర్స్ అమ్మకాల్లో టైర్3 నగరాలదే హవా!

by  |
పండుగ సీజన్ ఈ-కామర్స్ అమ్మకాల్లో టైర్3 నగరాలదే హవా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలన్నీ ప్రత్యేకంగా భారీ ఆఫర్లను ప్రకటించాయి. గతం కంటే ప్రత్యేక డిస్కౌంట్, ఇంకా ఇతర ఆఫర్లను ఈ-కామర్స్ కంపెనీలు ప్రకటించడంతో చాలామంది ఎక్కువ సంఖ్యలో కొనుగోళ్లు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి పండుగ సీజన్ కోసం టైర్3 నగరాల నుంచి కొనుగోళ్లు అధికంగా ఉన్నాయని ఈ-కామర్స్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్, వరంగల్, చిత్తూర్, కర్నూల్, గుంటూర్, వైజాగ్, ధన్‌బాద్ లాంటి నగరాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించాయి. ఈ క్రమంలో ఆర్థికవ్యవస్థ కొవిడ్-19 మహమ్మారి నుంచి బయటపడి డిమాండ్ పునరుద్ధరణ మెరుగవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్లిప్‌కాట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామ్ర్స్ కంపెనీలు ప్రస్తావించిన టైర్3 నగరాల నుంచి వచ్చిన వాటిలో దాదాపు సగం ఆర్డర్లు షాపింగ్ పోర్టల్స్ అమ్మకాలు జరిగాయి. ఉత్పత్తుల పరనంగా టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పెద్ద ఉపకరణాలు ఎక్కువగా అమ్ముడయ్యాయని తెలిపాయి. అంతేకాకుండా ప్రతి ఐదు మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ఫోన్ కోసం ఎక్స్ఛేంజ్ అవకాశాన్ని ఎంపిక చేసుకున్నారని కంపెనీలు పేర్కొన్నాయి. ఈ ఉత్పత్తుల తర్వాత మొబైల్స్, హెల్త్‌కేత్, ఇంటి అవసరాలకు వాడే వస్తువులకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని కంపెనీలు వెల్లడించాయి.


Next Story

Most Viewed