లంచం ఇవ్వు.. ఆస్తి పన్ను మాఫీ చేస్తా..

93
ACB

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్తి పన్ను కట్టలేకనే బకాయి పడ్డ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు రెవెన్యూ ఇన్ స్పెక్టర్. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా నర్సింహ రెడ్డి అనే వ్యక్తి బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తిరుపతి నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను బకాయి పడ్డాడు. దానిని మాఫీ చేయడానికి కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రఫీ రూ.9 వేలు డిమాండ్ చేశాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆస్తి పన్ను కట్టలేని స్థితిలో ఉన్న నర్సింహారెడ్డి అంత ఇచ్చుకోలేనని బతిమిలాడాడు. అయినా ఆయన వినకపోవడంతో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచన మేరకు తన షాప్ లోనే డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి వచ్చిన రఫీ.. రూ.9 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..