కరోనా కొత్త వేరియంట్.. భయం గుప్పిట్లో దేశాలు

by  |
Delta and delta plus variants
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ దేశాలను డెల్టా వేరియంట్ రకం కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 85 దేశాల్లో బయటపడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి్స్తోందని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరిన్ని దేశాల్లో వ్యాప్తి చెందే సూచనలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 170 దేశాల్లో ఆల్ఫా వేరియంట్‌, 119 దేశాల్లో బీటా, 71 దేశాల్లో గామా, 85 దేశాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు నమోదైనట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, డెల్టా వేరియంట్‌.. అల్ఫా వేరియంట్ కన్నా అత్యంత వేగంగా, ప్రమాదకరస్థాయిలో సంక్రమిస్తున్నట్లు WHO వెల్లడించింది. ఇక భారత్‌తో డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా డెల్లా వేరియంట్‌తో మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు.

Next Story

Most Viewed