జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ

by  |
జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ
X

దిశ, హైదరాబాద్: వివిధ పత్రికల్లో పని చేస్తున్న 50మంది జర్నలిస్టులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF)ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిత్యావసర సరుకులను అందజేశారు. మామిడి రామయ్య ఫౌండేషన్ (MRF)వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, జినుగుర్తి రామచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు జె.ఉదయ్ భాస్కర్‌రెడ్డి తమ సొంత ఖర్చులతో సరుకులను సమకూర్చారు. ఇదే కార్యక్రమంలో ‌‌భారత్ సేవాశ్రమ సంఘ్ ప్రతినిధులు మునీశ్వరానంద స్వామి, వెంకటేశ్వరానంద స్వామి దుస్తులు పంపిణీ చేయగా, శంకరారాధ్యమఠం ప్రతినిధులు కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, కార్యదర్శి ఎవీఎన్ రావు మాట్లాడుతూ ఒక్కొక్కరికి రూ.800 విలువ చేసే పది కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు మంచి నూనె, ఉప్పు, కారంతో పాటు 2 మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు విజయానందరావు, పాండు రంగారావు, ఉదయ్ భాస్కర్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే ) కార్యదర్శి నిరంజన్ కొప్పు, గండ్ర నవీన్, రాజశేఖర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

tags: TWJF, HUJ, Bharat Sevashram Sangha, essentials Distribution, Lockdown, Journalists, Corona Effect



Next Story