మైనార్టీ వృద్ధుడి గడ్డం కత్తిరించిన అపరిచితులు.. హీరోయిన్‌పై ఫిర్యాదు

by  |
swara-basaker 1
X

దిశ, సినిమా: హీరోయిన్ స్వరా భాస్కర్‌పై ఓ న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘజియాబాద్‌లో ఓ మైనార్టీ వర్గానికి చెందిన వృద్ధుడిపై అటాక్ చేసి గడ్డం కత్తిరించిన కేసులో ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఆమెతో పాటు జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్, ఆసిఫ్ ఖాన్‌లు కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారని… ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని అలాంటి వీడియోలను డిలీట్ చేయకుండా చోద్యం చేస్తున్నాడని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అయితే, దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. మరో వైపు బాధిత వృద్ధుడు అబ్దుల్ తాయత్తులు అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నాడని, అందుకే కొందరు తనపై దాడిచేశారని పోలీసులు చెప్తుండగా.. అతని కుటుంబసభ్యులు దీన్ని ఖండించారు. జై శ్రీరామ్, వందేమాతరం నినాదాలు చేయాలని ఒత్తిడి చేస్తూ తనపై అటాక్ చేశారని ఆరోపించారు. అసలు తమకు తాయత్తులు అమ్ముకునే బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్తున్నారు.



Next Story

Most Viewed