- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులపై కాల్పులు
<p>దిశ, వెబ్‌డెస్క్: పోలీసులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన ద్వారకాలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 4 గంటలకు రాజీవ్ అనే పోలీస్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్ అజయ్ కుమార్ కలిసి ఢిల్లీ ద్వారకలోని సెక్టార్-23లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బార్తల్‌లోని ఓ స్క్రాప్ షాప్‌లో పలువురు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించారు. అనంతరం వారు అక్కడికి చేరుకుని దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో దుండగులు కానిస్టేబుల్ రాజీవ్‌పై కాల్పులు జరిపారు. అనంతరం అజయ్ […]</p>
దిశ, వెబ్‌డెస్క్: పోలీసులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన ద్వారకాలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 4 గంటలకు రాజీవ్ అనే పోలీస్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్ అజయ్ కుమార్ కలిసి ఢిల్లీ ద్వారకలోని సెక్టార్-23లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బార్తల్‌లోని ఓ స్క్రాప్ షాప్‌లో పలువురు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించారు. అనంతరం వారు అక్కడికి చేరుకుని దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో దుండగులు కానిస్టేబుల్ రాజీవ్‌పై కాల్పులు జరిపారు. అనంతరం అజయ్ తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దుండగులు కాల్పులు జరపడంతో నేలమీద పడిపోయిన రాజీవ్.. కొద్దిసేపటికి తేరుకుని దుండగులపై తిరిగి కాల్పులు జరిపాడు. కానీ, దుండగులు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.






