ఆ ఉద్యోగుల జీతాల్లో.. 50 శాతం కోత

by Shamantha N |   (  Updated:2020-08-20 08:32:41  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. దాదాపు అన్ని దేశాల్లో వైరస్ విజృంభించి, ప్రజల జీవన విధాన్ని కకావికలం చేసింది. అంతేగాకుండా పలు కంపెనీలు, వివిధ రంగాలు కూడా తీవ్ర నష్టాల్లో చిక్కుకున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) భారీ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. దాంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధిచాలని నిర్ణయించింది. డీఎంఆర్‌సీ తన ఉద్యోగుల భత్యాలను 50 శాతం [&hellip;]</p>

ఆ ఉద్యోగుల జీతాల్లో.. 50 శాతం కోత
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. దాదాపు అన్ని దేశాల్లో వైరస్ విజృంభించి, ప్రజల జీవన విధాన్ని కకావికలం చేసింది. అంతేగాకుండా పలు కంపెనీలు, వివిధ రంగాలు కూడా తీవ్ర నష్టాల్లో చిక్కుకున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) భారీ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది.

దాంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధిచాలని నిర్ణయించింది. డీఎంఆర్‌సీ తన ఉద్యోగుల భత్యాలను 50 శాతం తగ్గించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆగస్టు నెల నుంచే వర్తిస్తుందని పేర్కొన్నారు. మెట్రో ఉద్యోగులు ఇకపై ముందస్తు జీతం తీసుకోలేరు.

కరోనా సంక్షోభం కారణంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను చాలా కాలంగా మూసివేసిన విషయం తెలిసిందే.

Next Story