వ్యాక్సినేషన్ డ్రైవ్‌ వేగం పెంచండి.. మోడీకి ఢిల్లీ సీఎం లేఖ!

by  |
వ్యాక్సినేషన్ డ్రైవ్‌ వేగం పెంచండి.. మోడీకి ఢిల్లీ సీఎం లేఖ!
X

న్యూఢిల్లీ : దేశాన్ని కొవిడ్ థర్డ్‌వేవ్ నుంచి రక్షించేందుకు గాను వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు వ్యాక్సిన్ పెంపు ఉత్పత్తిపై సూచనలు చేస్తు ప్రధాని మోడీకి ఆయన శనివారం లేఖ రాశారు. 18 నుంచి 44 ఏండ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్ కోసం కేంద్రం పంపిన వ్యాక్సిన్లు అన్నింటిని సద్వినియోగం చేసుకున్నామని లేఖలో తెలిపారు. ప్రస్తుతం కొన్ని డోసుల మాత్రమే తమ వద్ద ఉన్నట్టు చెప్పారు. శనివారం సాయంత్రం నాటికి అవి కూడా అయిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్ రాగానే మళ్లీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రీ ఓపెన్ చేస్తామని వెల్లడించారు.

ఇక వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పెంచేందుకు గాను ప్రధాని మోడీకి లేఖలో పలు సూచనలు చేశారు. వ్యాక్సిన్ స్టాక్‌ను పెంచేందుకు గాను భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్‌ను తయారు చేయాలని దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులందరికీ ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. విదేశీ వ్యాక్సిన్ తయారీ దారులు వారి వ్యాక్సిన్లను దేశంలోకి పంపేందుకు అనుమతులు జారీ చేయాలని చెప్పారు. ఈ మేరకు విదేశీ తయారీ దారులతో కేంద్రం చర్చించాలి. వారి దగ్గరి నుంచి వ్యాక్సిన్ సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సూచించారు. కొన్ని దేశాలు తమ అవసరాల కంటే ఎక్కువగా వ్యాక్సిన్ స్టోర్ చేసుకుని పెట్టుకున్నాయనీ..వారిని రిక్వెస్ట్ చేసి ఆ స్టాక్‌ను భారత్‌కు వచ్చేలా చూడాలని అన్నారు.


Next Story

Most Viewed