ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ అరుదైన రికార్డు

6

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 167 మ్యాచ్‌ల్లో 166 ఇనింగ్స్ ఆడిన శిఖర్ ధావన్.. 39 అర్ధ సెంచరీలు చేశాడు. శిఖర్ ధావన్ అనంతరం విరాట్ కొహ్లీ(38), సురేష్ రైనా(38), రోహత్ శర్మ(38)లు ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 46 ఆఫ్ సెంచురీలతో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.