డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

by  |
డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
X

దిశ, నిజామాబాద్ రూరల్: డిచ్‌పల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారి పాత నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 23 వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 25 వరకు,1000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు, 2000 రూపాయల ఆలస్య రుసుముతో వచ్చే నెల 1 వ తేదీ వరకు, ఫీజును చెల్లించవచ్చుని అన్నారు. సంబంధిత డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించగలరని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించగలరు కోరారు.

Next Story

Most Viewed