రాజ్‌నాథ్‌ను ఫాలో అయిన రష్యా ఆఫీసర్స్ 

by  |
రాజ్‌నాథ్‌ను ఫాలో అయిన రష్యా ఆఫీసర్స్ 
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన కోసం రష్యాకు వెళ్లారు. మాస్కోలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ చర్చల్లో రష్యా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ కీలక చర్చలు నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ఎనిమిది సభ్య దేశాల రక్షణ శాఖ మంత్రులు భద్రతాపరమైన, ఉగ్రవాదం లాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన మార్గాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు భారత్‌, రష్యా ద్వైపాక్షిక రక్షణ శాఖ బలోపేతం అయ్యేందుకు కీలక పాత్ర పోషించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రుల మధ్య చర్చలు జరుగుతాయనే అంశంపై అడిగిన ప్రశ్నకు భారత ప్రభుత్వాధికారులు అలాంటిదేమీ లేదనీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నిలువరించడానికి భారత్, రష్యా దేశాలు సహకరించుకునేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

రాజ్‌నాథ్‌ను ఫాలో అయిన రష్యా ఆఫీసర్స్

ఈ పర్యటనలో భాగంగా రష్యాకు చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్, అక్కడి అధికారులు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు. ప్రస్తుత కొవిడ్-19 వ్యాప్తి ఉన్న క్రమంలో మన దేశ సంస్కృతిలో భాగంగా ఉన్న.. నమస్తే అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. దీంతో ఆ అధికారి షేక్‌హ్యాండ్ ఇవ్వడం మానేసి ప్రతినమస్కారం చేశారు.


Next Story

Most Viewed