- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు రిమాండ్
<p>దిశ, కూకట్పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ వసంత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు నల్లమిడి సిసింద్రి(23)ని కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక ప్రాంతానికి చెందిన పితాని లక్ష్మి గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటు స్థానికంగా వాచ్‌మెన్‌గా పని చేస్తుంది. ఇదిలా ఉండగా లక్ష్మీ కూతురు గత నెల రోజులుగా వసంత్‌నగర్ […]</p>

దిశ, కూకట్పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ వసంత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు నల్లమిడి సిసింద్రి(23)ని కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక ప్రాంతానికి చెందిన పితాని లక్ష్మి గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటు స్థానికంగా వాచ్‌మెన్‌గా పని చేస్తుంది. ఇదిలా ఉండగా లక్ష్మీ కూతురు గత నెల రోజులుగా వసంత్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తన చెల్లెలు బి.లక్ష్మీ ఇంట్లో ఉంటుంది.
కాగా లక్ష్మీ కూతురు (15) ఈ నెల 8వ తేదిన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన పిన్ని పిల్లలు అయిన గణేష్, మహేష్‌లతో కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. రాత్రి వరకు బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద గాలించిన ఫలితం లేక పోయింది. బాలిక తల్లి లక్ష్మీకి సమాచారం అందించడంతో అదే రోజు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలికను నల్లమిడి సిసింద్రి కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. నిందితుడిపై 164 సీఆర్పీసీ ఐపీసీ 376(2)(ఎన్), పోస్కో సెక్షన్ 6, 5, ఐపీసీ 363 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.






