- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోనసీమలో జనావాసాల్లోకి జింకలు
<p>దిశ, వెబ్ డెస్క్: వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో జింకలు పలు లంకల్లోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంకల్లో చోటు లేక జింకలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం సమీపంలో ఉన్న నారాయణ లంకలో జింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. గత వారం రోజులుగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంకల్లో ఎక్కడా వాటికి చోటు దొరకక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గోదావరి లంకలో నుండి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోకి వచ్చిన రెండు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో జింకలు పలు లంకల్లోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంకల్లో చోటు లేక జింకలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం సమీపంలో ఉన్న నారాయణ లంకలో జింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి.
గత వారం రోజులుగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంకల్లో ఎక్కడా వాటికి చోటు దొరకక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గోదావరి లంకలో నుండి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోకి వచ్చిన రెండు జింకలు స్థానికంగా హల్ చల్ చేశాయి.
Next Story






