దీప్తి ఎంట్రీతో షణ్ముక్ హ్యాపీ.. వీకెండ్ ప్రోమో అదుర్స్

119
Deepthi Sunaina, Shanmukh Jaswanth

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా లవ్ కపుల్ షణ్ను, దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది వరకే గత బిగ్ బాస్‌‌ షోలో పాల్గొన్న సునైనా ఇప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ షణ్నుకు ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లను రిక్వెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, బిగ్‌బాస్ శుక్రవారం ఎపిసోడ్‌లో షణ్నుని కలిసేందుకు అతని అమ్మ రావడంతో సునైనా గురించి ఎంతో ఆసక్తిగా అడిగాడు. అయితే తాజాగా.. శనివారం ఎపిసోడ్‌కి చెందిన ప్రోమో విడుదలైంది. అందులో మరికొంత మంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చి సందడి చేస్తుండగా.. షణ్ను కోసం అతని అన్నయ్య రావడంతో మళ్లీ ఎంతో నిరాశ చెందాడు. అనంతరం ఒక్కసారిగా దీప్తి సునైనా ఎంటర్ కావడంతో షణ్ను ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ‘సచ్చినోడా..నిన్ను చాలా మిస్సయ్యాను’ అని దీప్తి అనగానే.. షణ్ను కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. సిరి వాళ్ల అమ్మ హగ్ చేసుకోవడం నచ్చలేదు అని చెప్పినప్పటి నుంచి షణ్ను డల్‌గా ఉండగా.. సునైనా ఎంట్రీతో ఇక నుంచి ఫుల్ జోష్‌లో ఆడుతాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తు్న్నారు.