- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పుకున్న దీపిక.. సోషల్ మీడియాలో వివరణ
by Shyam |
<p>దిశ, సినిమా : టాలెంటెడ్ బ్యూటీ దీపికా పదుకొనే ముంబై అకాడమీ ఆఫ్ మూవీ ఇమేజెస్(MAMI) చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 2019లో కిరణ్ రావు తర్వాత ఈ పదవిలో నియమించబడిన హీరోయిన్.. ఈ అనుభవం సుసంపన్నమైనదని తెలిపింది. ఒక ఆర్టిస్టుగా ప్రపంచం నలుమూలల నుంచి సినిమా, టాలెంట్‌ను ముంబైకి తీసుకురావడం ఉత్తేజకరమైనదిగా భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం వర్క్ బిజీ వల్ల MAMI బాధ్యతలను సరిగ్గా […]</p>

X
దిశ, సినిమా : టాలెంటెడ్ బ్యూటీ దీపికా పదుకొనే ముంబై అకాడమీ ఆఫ్ మూవీ ఇమేజెస్(MAMI) చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 2019లో కిరణ్ రావు తర్వాత ఈ పదవిలో నియమించబడిన హీరోయిన్.. ఈ అనుభవం సుసంపన్నమైనదని తెలిపింది. ఒక ఆర్టిస్టుగా ప్రపంచం నలుమూలల నుంచి సినిమా, టాలెంట్‌ను ముంబైకి తీసుకురావడం ఉత్తేజకరమైనదిగా భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం వర్క్ బిజీ వల్ల MAMI బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేక పోతున్నాననే ఉద్దేశంతో ఈ పదవి నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. MAMI ఉత్తముల చేతిలో ఉందని.. ఈ అకాడమీతో తన అనుబంధం జీవితకాలం కొనసాగుతుందని చెప్పింది.
Next Story






