- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపిక ‘తమాషా’ ట్రిబ్యూట్
<p>దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే, రణ్‌బీర్ కపూర్ కలిసి నటించిన ‘తమాషా’ సినిమా రిలీజై ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. దీపిక మనసుకు దగ్గరైన చిత్రం కూడా ఇదే. అందుకే ఈ మూవీ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ గ్రేట్ ట్రిబ్యూట్ ఇచ్చింది దివా. సోషల్ మీడియాలో తన పేరుకు బదులుగా ‘తమాషా’లో తన క్యారెక్టర్ నేమ్ తారగా మార్చేసింది. అంతే కాదు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే, రణ్‌బీర్ కపూర్ కలిసి నటించిన ‘తమాషా’ సినిమా రిలీజై ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. దీపిక మనసుకు దగ్గరైన చిత్రం కూడా ఇదే. అందుకే ఈ మూవీ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ గ్రేట్ ట్రిబ్యూట్ ఇచ్చింది దివా. సోషల్ మీడియాలో తన పేరుకు బదులుగా ‘తమాషా’లో తన క్యారెక్టర్ నేమ్ తారగా మార్చేసింది. అంతే కాదు అన్ని హ్యాండిల్స్‌లోనూ డీపీ చేంజ్ చేసింది. తన ఫొటోకు బదులుగా సినిమాలో రణ్‌బీర్‌తో కలిసి ఉన్న పిక్‌ను డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టింది.
కాగా దీపిక, రణ్‌బీర్ కొన్నాళ్లు ప్రేమించుకుని, ఆ తర్వాత దూరమైన విషయం తెలిసిందే. అయినా సరే అలాంటివి మనసులో పెట్టుకోకుండా.. కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని తమాషాకు అమేజింగ్ ట్రిబ్యూట్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలనుందని చెబుతున్నారు.






