సోషల్ మీడియాలో పోస్ట్‌లన్నీ డిలీట్ చేసిన దీపిక

by  |
సోషల్ మీడియాలో పోస్ట్‌లన్నీ డిలీట్ చేసిన దీపిక
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరం సందర్భంగా సరికొత్త పోస్ట్‌తో వస్తుందనుకున్న బాలీవుడ్ దివా దీపికా పదుకొనే.. అభిమానులకు షాక్ ఇచ్చింది. న్యూ పోస్ట్ గురించి పక్కన పెడితే అసలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఉన్న అన్ని పోస్ట్‌లను డిలీట్ చేసేసింది. ఇన్‌స్టాగ్రామ్‌‌లో 52.5 మిలియన్ ఫాలోవర్స్ , ట్విట్టర్‌లో 27.7 మిలియన్ ఫాలోవర్స్‌‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీపిక.. కారణం కూడా చెప్పకుండా ఒక్కసారిగా ఇలా చేయడంపై పలు కారణాలు వెతుక్కుంటున్నారు నెటిజన్లు. కొందరేమో ఇది ప్రమోషన్ స్ట్రాటెజీ అంటుంటే.. మరి కొందరేమో చాలా వింతగా ఉంది, అసలు ఏమై ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు.

నెట్టింట్లో దాదాపు పది గంటల చర్చ తర్వాత.. వీటన్నిటికి సమాధానం చెప్తూ లేటెస్ట్ పోస్ట్‌‌తో వచ్చేసింది బాజీరావ్ మస్తానీ హీరోయిన్. ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ విషెస్ అందించిన భామ.. ‘మై ఆడియో డైరీ’ పేరుతో పాడ్‌కాస్ట్‌ తీసుకొస్తున్నట్లుగా 2021లో ఫస్ట్ పోస్ట్ పెట్టింది. తద్వారా తన ఆలోచనలు, ఫీలింగ్స్‌ను పంచుకుంటానని తెలిపింది. అందరూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంది.



Next Story

Most Viewed