దీపిక బ్యాక్ టు వర్క్..

1

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ దివా దీపికా పదుకొనే బాలీవుడ్ డ్రగ్ కేసులో విచారణకు హాజరైంది. ఓవైపు షకున్ బత్ర డైరెక్షన్‌లో గోవాలో షూట్ జరుగుతుండగానే, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసుల కారణంగా షూటింగ్‌కు బ్రేక్ తీసుకుని విచారణ కోసం ముంబై చేరుకుంది. ఇది జరిగి పది రోజులకు పైగానే అవుతుండగా.. మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు గోవా చేరుకుంది దీపిక. సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గురువారం ముగ్గురి కాంబినేషన్‌లో సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. డ్రగ్స్ కేసుతో కంప్లీట్ మూడ్ అవుట్‌లో ఉన్నా సరే.. క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించిందని తెలుపుతూ అప్రిషియేట్ చేసింది మూవీ యూనిట్.

మరోవైపు దీపిక షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్న సమయంలో తన కోసం వెయిట్ చేసి టైమ్ వేస్ట్ చేయకుండా అనన్య, సిద్ధాంత్ కాంబినేషన్‌లో సీన్స్ షూట్ చేశారట డైరెక్టర్ షకున్. కాగా 25 రోజుల ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మూవీ యూనిట్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇవ్వనుందని టాక్. మరోవైపు దీపిక భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘83’ సినిమా డిసెంబర్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది.