గోవా వెళ్లనున్న దీపికా, అనన్య

by  |
గోవా వెళ్లనున్న దీపికా, అనన్య
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పదుకొనె, యంగ్ బ్యూటీ అనన్య పాండే, క్రేజీ యాక్టర్ సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ షూటింగ్.. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. శకున్ బత్రా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా.. శ్రీలంకలో చిత్రీకరణ జరగనుందని ముందుగా వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు దీనిపై మరో అప్‌డేట్ వచ్చింది. కరోనా కారణంగా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉండటంతో శ్రీలంకలో కాకుండా గోవాలో షూటింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, ఇందుకోసం సెప్టెంబర్ రెండో వారంలో దీపికా, అనన్య, సిద్ధాంత్ చతుర్వేది గోవా పయనమవుతారని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌లో భాగంగా 25 రోజుల పాటు గోవాలో కరోనా నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణ సాగనుంది. కాగా దీపికా పదుకొనె ఇప్పటికే తన క్వారంటైన్ డేస్ లోని కొంత సమయాన్ని సినిమా స్క్రిప్ట్ చదివేందుకు వెచ్చిస్తూ.. ఆ క్యారెక్టర్ కోసం రిహార్సల్స్ కూడా చేస్తున్నట్టు వినికిడి. కాగా దీపికా ఈ సినిమాతో పాటు భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘83’ చిత్రంలోనూ నటిస్తోంది.

Next Story

Most Viewed