- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపికా ‘బ్రాండ్’ షూటింగ్ జాగ్రత్తలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ దివా దీపికా పదుకొనేకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 52 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తనను.. తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేయడంలో అతిశయోక్తి లేదు. అయితే కరోనా కారణంగా యాడ్ షూటింగ్స్ ఆగిపోవడంతో మళ్లీ మొదలు పెట్టాల్సి ఉంది దీపిక. కానీ కరోనా టైమ్ కాబట్టి పది బ్రాండ్‌లకు సంబంధించిన షూటింగ్ మూడు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకుందట. ఇందుకోసం, ఓ ప్రైవేట్ స్టూడియో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ దివా దీపికా పదుకొనేకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 52 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తనను.. తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేయడంలో అతిశయోక్తి లేదు. అయితే కరోనా కారణంగా యాడ్ షూటింగ్స్ ఆగిపోవడంతో మళ్లీ మొదలు పెట్టాల్సి ఉంది దీపిక. కానీ కరోనా టైమ్ కాబట్టి పది బ్రాండ్‌లకు సంబంధించిన షూటింగ్ మూడు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకుందట.
ఇందుకోసం, ఓ ప్రైవేట్ స్టూడియో కూడా సెట్ చేసుకున్న దీపిక.. కేవలం కొద్ది మంది మాత్రమే షూటింగ్‌లో పాల్గొనాలని.. జాగ్రత్తగా ఉండాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా మంది సెలెబ్రిటీలకు కరోనా పాజిటివ్ రావడంతో జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు. అందుకే 10 యాడ్ షూటింగ్స్‌ను 3 రోజుల్లో కంప్లీట్ చేయాలని నిర్ణయించుకుందని సన్నిహితులు చెప్తున్నారు.
కాగా, సూపర్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అయిన దీపిక.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్, దీపిక కెమిస్ట్రీని తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే వెయిట్ చేస్తుండగా.. ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.






