- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో వివాదంలో దీపికా పదుకొనే.. ఫైర్ అయిన డైరెక్టర్
<p>దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనేను ఇటీవలే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న లెవిస్ జీన్స్.. కొత్తగా ఓ యాడ్ రిలీజ్ చేసింది. మ్యూజికల్ ట్రూప్‌తో కలిసి దీపిక ఓ స్టూడియోలో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించిన ఈ యాడ్ వీడియో నెటిజన్లను అట్రాక్ట్ చేయగా.. ఈ విధంగా తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంది లెవిస్. అయితే నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘యె బెల్లెట్’ డైరెక్టర్ సూని తరపొరెవాలా మాత్రం ఈ యాడ్‌పై ఫైర్ అవుతూ ‘ఇది […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనేను ఇటీవలే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న లెవిస్ జీన్స్.. కొత్తగా ఓ యాడ్ రిలీజ్ చేసింది. మ్యూజికల్ ట్రూప్‌తో కలిసి దీపిక ఓ స్టూడియోలో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించిన ఈ యాడ్ వీడియో నెటిజన్లను అట్రాక్ట్ చేయగా.. ఈ విధంగా తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంది లెవిస్. అయితే నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘యె బెల్లెట్’ డైరెక్టర్ సూని తరపొరెవాలా మాత్రం ఈ యాడ్‌పై ఫైర్ అవుతూ ‘ఇది మేధోసంపత్తిని దొంగిలించడమే (ఇంటలెక్చువల్ థెఫ్ట్)’ అని పోస్ట్ పెట్టింది.
తమ సినిమా కోసం వేసిన డ్యాన్స్ స్టూడియో సెట్‌ను అనుమతి లేకుండా ఎలా వాడుకుంటారని సోషల్ మీడియా వేదికగా నిలదీసింది. ఇది గౌరవప్రదంగా లేదని, తమ అద్భుతమైన ప్రొడక్షన్ డిజైనర్ షాల్జాయిడ్ సృజనాత్మకతను ఇలా దోచుకోవడం అన్యాయం అంటూ తన సినిమాకు సంబంధించిన సీన్‌తో పాటు లెవిస్ యాడ్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది. కాగా లెవిస్ యాడ్ ప్రొడక్షన్ డిజైనర్ రూపిన్ సుచక్.. సినిమా, యాడ్ మధ్య పోలికలు ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. కానీ తాము యాడ్ డైరెక్టర్ చెప్పినట్లే చేశామని తెలిపారు.






