ద్రౌపదిగా దీపికా పదుకునే

by  |
ద్రౌపదిగా దీపికా పదుకునే
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పదుకునే లాక్ డౌన్ పీరియడ్‌ను ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లు లాక్ చేసేందుకు ఉపయోగించానని తెలిపింది. ఫెమినా మ్యాగజైన్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి వివరించింది. 2020లో ‘ఛపక్’ సినిమాతో థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించిన దీపిక.. పాండమిక్ తర్వాత మూడు నెలలుగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత శకున్ బత్రా డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్న బ్యూటీ.. ఈ చిత్రం ఇండియన్ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేని రిలేషన్ షిప్ బేస్డ్ స్టోరి అని తెలిపింది.

షారుఖ్ ఖాన్‌ యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్‌’లో కీలక పాత్రలో కనిపించబోతున్న తను..ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నట్లు చెప్పింది. ఇక హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఇంటర్న్’ రీమేక్ చేయబోతున్నట్లు తెలిపిన దీపిక.. ‘ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ద్రౌపది పాత్రను పోషించబోతున్నట్లు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది. కాగా, ఈ ఐదు సినిమాల్లో ఫేవరేట్ రోల్ ఏదన్న ప్రశ్నకు..ఐదుగురు పిల్లల్లో ఒకరిని ఎంచుకోమంటే ఎలా అని సమాధానమిచ్చింది.

Next Story

Most Viewed