లైవ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు చెన్నై టీం బౌలర్ ప్రపోజ్.. వెంటనే హగ్, కిస్ (వీడియో) 

by  |
లైవ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు చెన్నై టీం బౌలర్ ప్రపోజ్.. వెంటనే హగ్, కిస్ (వీడియో) 
X

దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ చేసిన పనికి అభిమానులు షాక్ అయ్యారు. గురువారం పంజాబ్ సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్‌కు ఆడియన్స్ స్టాండ్‌లోనే ప్రపోజ్ చేశాడు. ఈ ఇన్సిడెంట్‌తో అవాక్కయిన తన గర్ల్ ఫ్రెండ్ అనందాన్ని తట్టుకోలేకపోయింది.

దీపక్ రింగ్‌తో ప్రపోజ్ చేయగా.. అందరూ చూస్తుండగానే తనను హగ్ చేసుకుని ఎస్ చేప్పేసింది. కాగా ఇదంతా చూస్తున్న అభిమానులు ఆశ్యర్యం, ఆనందం కలిసిన మూమెంట్‌ను ఎంజాయ్ చేశారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఈ వీడియోని టాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలపగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అయిపోయింది.



Next Story

Most Viewed