పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్.. హైకోర్టు మళ్లీ ఏం చెబుతుంది?

by  |
పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్.. హైకోర్టు మళ్లీ ఏం చెబుతుంది?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. సుప్రీంకోర్టు విధించిన 5 వారాల గడువు పాటించలేదనే కారణంతో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఎస్‌ఈసీ సంప్రదించింది.

ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంజ్ సమర్థిస్తుందా?.. లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేడు హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

డివిజన్ బెంచ్ కూడా స్టేను సమర్థిస్తే.. ఎస్ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోయింది. ఏది ఏమైనా ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.


Next Story