బియ్యం పక్కదారి పట్టించిన డీలర్ అరెస్టు

by  |

దిశ, నాగర్‌కర్నూల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు లాక్‌డౌన్ సమయంలో ఉచితంగా అందజేసే రాయితీ బియ్యాన్ని కోడేరు మండల కేంద్రంలోని రేషన్ ఓ రేషన్ డీలర్ పక్కదారి పట్టించాడు. మండలంలోని రేషన్ షాప్-3 యజమాని శారద భర్త శ్రీనివాసులు 95 క్వింటాల 95 కిలోల బియ్యాన్ని పక్కదారి పట్టించాడు. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు సీజ్ చేశామని తెలిపారు. అనంతరం పౌర సరఫరాల సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి, డీలర్‌ను ఆదివారం అరెస్టు చేశామని అన్నారు. రెవెన్యూ అధికారులు తనిఖీల నిర్వహణలో వెల్లడైన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్, వనపర్తి, హైదరాబాద్, మెదక్, నల్గొండ పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ తదితర మొత్తం 11 జిల్లాల్లోని 275 మంది రేషన్ కార్డు దారులు బియ్యాన్ని, వీఆర్ఓ సహాయంతో అక్రమంగా డ్రా చేశారని తెలిపారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని, అక్రమంగా డ్రా చేసి బ్లాక్ మార్కెట్ తరలించేందుకు నిల్వ ఉంచినట్టు గుర్తించామన్నారు. బియ్యాన్ని సీజ్ చేసి ప్రజా పంపిణీ చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు డీలర్ షిప్‌ను రద్దు చేయడం జరిగిందన్నారు. డీలర్‌కు వీఆర్ఓ సహకరించినట్టు వెల్లడైందని అతనిపై జిల్లా కలెక్టర్‌కు నివేదించా జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు తెలిపారు. పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే క్రిమినల్ చర్యలు తప్పవన్నారు.



Next Story

Most Viewed