ప్రాణం తీసిన ‘సిగరేట్’.. ఒక రోజు తర్వాత శవం గుర్తింపు

by  |
ప్రాణం తీసిన ‘సిగరేట్’.. ఒక రోజు తర్వాత శవం గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : సిగరేట్ తాగుదామని బయటకు వచ్చిన వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం జరగగా ఒక రోజు తర్వాత సోమవారం మధ్యాహ్నం వరకు శవాన్ని గుర్తించారు అధికారులు.

వివరాల్లోకివెళితే.. నగరంలోని బహిరంగ కాలువలో పడిపోయిన వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని వయస్సు సుమారు 42ఏళ్లు ఉంటుందని సమాచారం. సిగరేట్ తాగేందుకు బయటకు వచ్చిన వ్యక్తి అనుకోకుండా కాలువలో పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలువలు పొంగిపొర్లుతుండటంతో అతన్ని వెంటనే రక్షించడం కష్టతరంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ రెస్క్యూ సిబ్బంది ఆ వ్యక్తిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం అతని మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.



Next Story