- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు పక్కన శవం.. హత్యా.. ఆత్మహత్యా..?
by Batti.Sumithra |
<p>దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడె బల్లూర్ గ్రామ శివారులో రొడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం జాతీయ రహదారి పక్కన గుర్తించిన గుడె బల్లూర్ గ్రామస్తులు ఎస్సై నాగరాజుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్‌ఐ శవ పంచనామా నిర్వహించారు. ఈ వ్యక్తి చనిపోయి రెండు లేదా మూడు రోజులై ఉండొచ్చని […]</p>

X
దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడె బల్లూర్ గ్రామ శివారులో రొడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం జాతీయ రహదారి పక్కన గుర్తించిన గుడె బల్లూర్ గ్రామస్తులు ఎస్సై నాగరాజుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్‌ఐ శవ పంచనామా నిర్వహించారు. ఈ వ్యక్తి చనిపోయి రెండు లేదా మూడు రోజులై ఉండొచ్చని అన్నారు. పోస్టుమార్టం అనంతరం అసలు విషయం తెలుస్తుందన్నారు. మృతదేహాన్ని మక్తల్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు.
Next Story






